విరహం

Share:

Listens: 3933

నవీన కవిత

Society & Culture


నా కలల ప్రపంచానికి రాణివి నువ్వు

వలపు వనంలో విరిసిన పువ్వు నీ నవ్వు

నేను వెలకట్టలేని నీ ప్రేమని నాకు కానుకగా ఇవ్వు


పడిపోతున్నా నవ్వుతున్న నీ ప్రేమలోన

వద్దని నన్ను దూరంగా నెడుతున్నా

నేనున్నా నీ గుండెలోన


తళుకుమనే తారవు నువ్వు

మెరుపులీను నీ చిరునవ్వు

మసక తెరల మాటున నువ్వు

మనసైన మనిషిని దరి చేరనియ్యవు


కోరిన కాంతవు నువ్వు దూరమైపోయావు

ఏకాంతానికి నన్ను అంకితమిచ్చావు

ఏ కాంతీ లేని చీకట్లోకి తోసేశావు

కూసింత జాలైనా నాపై చూపించవు


ఎన్ని కవితలు రాయాలో నిన్ను మెప్పించేందుకు

ఎన్ని జన్మలు ఎదురు చూడాలో నిన్ను పొందేందుకు

ఏ తోడూ లేని ఎడారి నా జీవితం

చినుకు తడి కోసం పరితపిస్తోంది హృదయం

నదిలా కదిలోస్తావో వరదై ముంచేస్తావో నీ ఇష్టం


YouTube:

www.youtube.com/c/NS360

Instagram I'd:

naveenchenna.s