సూరీడు

Share:

Listens: 3268

నవీన కవిత

Society & Culture


"సాయం"కాలం ఎక్కడికీ పారిపోడు 

మబ్బుల మాటున మాయమూ కాడు 

కనబడటం లేదని, లేడని కాదు

స్వచ్ఛమైన మనషి, ఎప్పుడూ స్వయం ప్రకాశితుడు

తాను వెలుగుతూ తన చుట్టూ ఉన్న వాళ్లకి వెలుగునిచ్చే "సూరీడు"


ఏ పేరునీ ఆశించిక ప్రకాశించే సూరీడు

కనుకే ప్రజలూ కీర్తించరు

ఉచితంగా దొరికే దానికి విలువ ఇవ్వరు

కానీ కనబడిన ప్రతి రాయికీ మొక్కుతారు

కనబడని దేవుడికి మొక్కులు చెల్లిస్తారు

దీపం చుట్టూ తిరిగే పురుగులు

దిక్కుమాలిన గ్రహాలు


తమ మేథో స్థాయిని చేరుకోలేని సన్నాసులను

తమకి దగ్గరగా రానివ్వరు తెలివైన వాళ్లు 

తెలిసిన వాళ్లతో తెలిసీ తెలియక వాదిస్తే దక్కదు పరువు

తగు దూరం పాటిస్తేనే సూర్యుడి ద్వారా గ్రహాలకు వెలుగు

పరిధి దాటి భ్రమించే వారు ఆ ప్రభను భరించలేరు

naveenchenna.s@gmail.com