Promo - Vivaha Bandhalu by D Kameshwari

Share:

Vivaha Bandhalu - Telugu Audio Book

Fiction


వివాహబంధాలు స్త్రీ పురుషుల పవిత్ర ప్రేమలకు,వాళ్ళ జీవితాలకు ఆనందమయమైన అనుబంధాలు కావాలి కానీ , వాళ్ళ వ్యక్తిత్వాలకు,న్యాయమైన కోరికలకు ప్రతిబంధకాలు కాకూడదు. అలా జరిగినప్పుడు ప్రతి సంఘటన,ప్రతి చర్య, ప్రతి క్షణం భార్యకు నరకతుల్యమై పోతుంది.తన మెడ లోని పసుపుతాడును ఉరిత్రాడు గా ఊహించుకుని కుమిలిపోతుంది."భార్యకు భర్తే దైవం. భర్తకు భార్యను తిట్టి,కొట్టే హక్కుంది. భర్త ఏం చేసినా పడుండడం హిందు స్త్రీ ధర్మం." అంటూ పెద్దలు పాత కాలపు నీతులు బోధించినంత కాలం స్త్రీలకు పురుషుల నెదిరించే గుండెబలం,మనో ధైర్యం వుండవు గాక ఉండవు.వివాహబంధాల వెనుక దాగి ఉన్న స్త్రీల యదార్థ బాధలను మన కళ్ళ ముందుంచుతున్న చక్కని నవల.. వినిపించేకథలు లో కనిపించే రెండవ శ్రవ్య ధారావాహిక నవల "వివాహబంధాలు." ఏప్రిల్ 4 నుంచి మీకోసం.. తప్పక విని ఆదరించమన్న మనవితో..