Society & Culture
నాకు నచ్చేలా ఉన్న నిన్ను
నాకు తెలియకుండానే ఇష్టపడ్డాను
కానీ నా ప్రేమను నీకు చెప్పే పరిస్థితుల్లో నేను లేను
చెప్పి నీ స్నేహాన్ని వదులుకొలేను
సూటిగా చూస్తే నీకు ఎక్కడ తెలిసిపోతుందో అని
నేరుగా నీ కళ్ళలోకి కూడా చూడలేను
నా మనసొక మాయావి
జాలీ దయా లేవు దానికి
వద్దని వారించినా
పదే పదే నన్ను నెడుతుంది నీకేసి
ఆశ పడటం అది దక్కలేదని బాధపడటం
నీ వల్ల అనుభవించే బాధ కూడా ఒక సుఖం
నిన్ను నవ్వించడం నా బాధ్యత
నువ్వు ఏడిస్తే బాధపడతా
నువ్వు భయపడితే ధైర్యం చెబుతా
నువ్వు అనుకున్నది సాధించిన నాడు
నీకన్నా నేనెక్కువ సంతోషిస్తా
ఇది ప్రేమలేఖ కాదు
నా హృదయ ఘోష
నీకు తెలియాలని రాశా
కానీ నీకు ఇచ్చే ధైర్యం లేక
నా దగ్గరే దాచేసా
ఏదో ఒక రోజు
నువ్వే తెలుసుకుంటావు
అని ఒక చిన్న ఆశ
నువ్వు దక్కక పోయినా తట్టుకునేలా
నా మనసుని ముందే సిద్ధం చేశా
నేను ఏడుస్తూ నిన్ను ఏడిపించడం నా వల్ల కాదు
అందుకే నేను కావాలో లేదో
అనే నిర్ణయాన్ని నీకే వదిలేశా
Please check out my youtube channel:
www.youtube.com/c/NS360