Arts
#Kalaa Poornodayam – Chapter 1 కళా పూర్ణోదయం ప్రబంధ యుగానికి చెందిన ప్రాచీన తెలుగు సాహిత్యంలో అప్పటికీ ఇప్పటికీ విశిష్ట స్థానం అలంకరించిన మనోహర కావ్యం ‘కళాపూర్ణోదయం.’ ఇది మిగిలిన ప్రబంధాల వలే పురాణ ప్రధానమైనది కాదు. పూర్తిగా కాల్పనికం అందుచేత దీనికి వేరే మూలం అంటూ ఏదీ లేదు. ముఖ్యంగా కళాపూర్ణోదయం రచనా తీరు చదువరులను ఆశ్చర్య చకితులను చేస్తుంది. ఆధునిక కాలంలో కొన్ని నవలలోనూ, సినిమాలలోనూ 'ఫ్లాష్ బ్యాక్' గా మనం చెప్పుకునే ‘కాలక్రమ వ్యత్యయం’ అనే ఈ ప్రక్రియను సూరనార్యుడు పదహారవ శతాబ్దంలోనే ప్రవేశపెట్టాడని చెప్పాలి. 'నభూతో న భవిష్యతి' అన్న విధంగా సూరనార్యుడు రచించిన ఈ పద్య గద్య కావ్యం లోని మూల కవితా సౌందర్య, సౌరభాలకు ఏ మాత్రం భంగం కలగకుండా సరళమైన వచన రూపంలో అందించారు సుప్రసిద్ధ పత్రికా రచయిత కవి, అనువాదకులు శ్రీ రెంటాల గోపాలకృష్ణ. ఈ వచన కావ్యాన్ని ప్రప్రధమంగా శ్రవణ రూపంలో అందిస్తున్నది దాసుభాషితం. వినండి ‘కళాపూర్ణోదయం’. – #కళాపూర్ణోదయం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి. https://www.dasubhashitam.com/ab-title/ab-kalaa-poornodayam Listen to a part of Chapter 1 of #KalaaPoornodayam. Download the App via the link above to listen to the full title. –– ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత. ––– ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.