Society & Culture
నిన్ను చూడాలని రోజూ నీతో మాట్లాడాలని
ఏదో వెర్రి కోరిక నాలోన
కుదరదని తెలిసినా వినదు కదా మనసు
నిన్ను ప్రేమించడం తప్ప దానికి ఇంకేం తెలుసు
కలిసి నడిచిన వారందరూ
చివరకి ఒకే తీరం చేరరు
అని తెలిసికునేలోపేవదిలి వెళ్లిపోయావు నన్ను
మనసంతా నింపుకున్నా నిన్ను
అంత సులువుగా ఎలా మర్చిపోగలను
మనసులో ఉన్న బాధను ఎవరితో పంచుకోలేను
మనసులో దాచుకొని మామూలుగా ఉండలేను
ఇంత వేదనకు గురిచేసినా నిన్ను దూషించలేను
కోరి వలచిన నిన్ను ఇప్పుడెలా ద్వేషించగలను
కాలం మన ప్రేమ గాయన్ని మాన్పగలదేమో
కానీ మనసులో బలంగా ముద్రించుకున్న నీ రూపాన్ని మాత్రం అది చెరపలేదు
విడిపోయిన కొత్తలో నేను అనుభవించిన బాధలు
వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడు మధుర జ్ఞాపకాలు
మతాలు, కులాలు, మూఢనమ్మకాలు
ఇలా ఇద్దరు మనుషుల మధ్య ఎన్నో అడ్డుగోడలు
మనసులు కలిస్తే చాలదు మన సమాజంలో
విడిపోయిన ప్రేమలకే విలువెక్కువ ఈ లోకంలో
Please check out my youtube channel:
www.youtube.com/c/NS360