గొంగళి పురుగు

Share:

Listens: 1648

నవీన కవిత

Society & Culture


మనిషొక యంత్రం

మనసొక తెల్ల కాగితం

గొంగళి పురుగులా మొదలైంది నీ ప్రయాణం

సీతాకోకలా మారాలా

చేతకాదని వదిలేయాలా

అనేది నీ సామర్థ్యం

దేహాన్ని ఎలా వాడుకుంటావో

దాహాన్ని ఎలా తీర్చుకుంటావో

ఎన్ని రంగులు పులుముకుంటవో ఇక నీ ఇష్టం


పాకినంత కాలం ఎవరూ పట్టించుకోరు

ఎగరగానే నీ వెనక వస్తారు

ఎదిగితే మావాడే అని చెప్పుకుంటారు

బెల్లం చుట్టూ మూగే ఈగలు ఈ జనాలు

నీతో పని లేకుంటే పట్టెడు మెతుకులు కూడా పెట్టరు


ఆశలు చంపుకోకు

అనుకున్నది జరగట్లేదని

ఆశయాన్ని వదిలేయకు

పరిస్థితులు అనుకూలంగా లేవని

ఒక లయలో గమించే ఈ భూమి

శతకోటి జీవాలలో నువ్వొక ప్రాణి

ఊయలలోనే ఆగిందా నీ పాదం

పడుతూ లేస్తూనే నేర్చుకోలేదా నడవటం


YouTube:


www.youtube.com/c/NS360



Instagram I'd:


naveenchenna.s