Arts
#గోన గన్నారెడ్డి ఎందరో రాజులు ఈ భువిని పాలించారు. కానీ చరిత్రలోనే ఒక స్త్రీ రాజ్యాన్ని ఏలడం గూర్చి, అందులో ఆమె ఎదుర్కొన్న కష్టనష్టాల గూర్చి అడవి బాపిరాజుగారు ఒక నవలగా వ్రాశారు. కాకతీయ వంశంలోని గణపతిరాజుకు పుత్రికలే తప్ప పుత్రులు కలుగలేదు. తన రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల్లా పాలించి, పోషించే గణపతి రాజు తన తరువాత ఆ ప్రజలకు సామంత రాజుల వల్ల నష్టం కలుగుతుందని ఎంచి, తన పుత్రికల్లో పెద్దదయిన రుద్రదేవిని రుద్రరాజుగా పెంచి అన్ని విద్యలు నేర్పిస్తాడు. అదే రాజ్యంలో గజదొంగగా పేరుగాంచిన గోన గన్నారెడ్డి ఆ రాజ్యంలోని సామంతరాజుల పిల్లలను అపహరించి తీసుకెళ్తుంటాడు. . రుద్రదేవి, కాకతీయరాజ్యంలో జరిగే కుట్ర, గోన గన్నారెడ్డిల గూర్చి వర్ణన ఈ భాగంలో వినండి. – #గోన గన్నారెడ్డి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి. https://www.dasubhashitam.com/ab-title/ab-gona-gannareddy-1 Listen to a part of Chapter 1 of #GonaGannareddy. Download the App via the link above to listen to the full title. –– ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత. ––– ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.