బానిస

Share:

Listens: 8534

నవీన కవిత

Society & Culture


ఆశలకు ఉరి వేసి చంపే అవసరాలు

ఊరికి దూరంగా వెలివేసే ఉద్యోగాలు

కళాశాల నుండి బయటపడగానే కష్టాలు షురూ!


ఏం చేస్తున్నావ్, ఎంత సంపాదిస్తున్నవ్?

చదువు పూర్తయి సరిగ్గా నెల తిరగకుండానే ఎదురయ్యే ప్రశ్నలు

నిదానంగా ఆలోచించుకునే అవకాశం

సరైన పనిని ఎంచుకునే స్వతంత్రం

ఈ రెండూ ఎండమావులే చాలా మందికి

బాధ్యతలు అనే సంకెళ్లు తగిలించి లాగేస్తారు కిందికి


మనసు నలిగిపోతున్నా

పనికి ఇస్త్రీ చొక్కా వేయాల్సిందే

కలలు కరిగిపోతున్నా

కాలంతో పాటు పరుగు తీయాల్సిందే


వంద పుస్తకాలు చదివింది

ఒకడి కింద తలదించుకుని బ్రతకడానికా?

అన్ని పరీక్షలు రాసింది

ఒక్కరోజు పడే జీతం డబ్బులకోసం

నెలంతా గొడ్డు చాకిరి చేయడానికా?


ఏం నేర్పుతుంది మనకీ విద్యా వ్యవస్థ?

కొత్తగా ఆలోచించి

సమాజానికి పనికొచ్చేలా ఏదైనా చేయమనా?

కొత్త ఇల్లు, కారు కొనుక్కొని

జీవితాంతం EMI లు కట్టుకోమనా??