Society & Culture
తాము అనుకున్నది సాధించే క్రమంలో నువ్వొక సాధనం
ఒకరి ఆటలో నువ్వు పావుగా మారటం
తాను గెలవడానికి నిన్ను ఆయుధంగా వాడటం
అన్నీ తెలిసి కూడా ఏమీ అనలేం
సగటు ఉద్యోగికి ఇది సర్వ సాధారణం
గాడిదలా భారం మోస్తూ
చెప్పిందానికల్లా తలాడిస్తూ
నీ శక్తిని ఇంకెవరికో ధారబోస్తూ
పొట్టనింపుకోవడమే కదా నీ ఉద్యోగం
చచ్చే వరకు బ్రతుకుని ఇలా నెట్టుకు పోవడం మూర్ఖత్వం
పని చేసే శ్రామికుడివి నువ్వైతే
ఆ ఫలితం అనుభవించే యజమానివి కూడా నువ్వే అవ్వాలి
ప్రజలకి ఉపయోగపడేలా ఏదైనా చేసి సంపాదించాలి
ఈత రాకున్నా నీటిలో దూకేయ్
అని చెప్పటం కాదు నా ఉద్దేశం
భయపడి ఒడ్డునే ఆగిపోతే
ఎప్పుడు నేర్చుకుంటావ్ ఈదటం
పని నేర్చుకో కొంతకాలం
మెళకువలు అర్థం చేసుకో ఇంకొంత కాలం
నిలదొక్కుకునేంత వరకూ
ఇల్లు గడవడానికి కొంత దాచుకుని
ఇక అడుగుపెట్టు నీ ఆశల బజారులో
అనుకున్నది సాధించగలవు తొందరలో
naveenchenna.s@gmail.com