Music
అంతయు నీవే హరి పుండరీకాక్షచెంత నాకు నీవే శ్రీరఘురామ కులమును నీవే గోవిందుడా నాకలిమియు నీవే కరుణానిధితలపును నీవే ధరణీధర నానెలవును నీవే నీరజనాభ తనువును నీవే దామోదర నామనికియు నీవే మధుసూదనవినికియు నీవే విట్ఠలుడా నావెనకముందు నీవే విష్ణు దేవుడా పుట్టుగు నీవే పురుషోత్తమకొన నట్టనడుము నీవే నారాయణఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే