ఆ నలుగురు

Share:

Listens: 5837

నవీన కవిత

Society & Culture


ఆత్మ పరిశీలన అలవాటు లేని మనుషులు

అడవిలో తిరిగే జంతువులు

అవతలి వారు అచ్చం తమలాగే ప్రవర్తిస్తే తట్టుకోలేరు

అది తమ ప్రతిబింబమే అని గుర్తించలేరు


మనో వైకల్యంతో బాధపడే మనుషులు

తాము సుఖ పడరు

తమ వాళ్లని ప్రశాంతంగా ఉండనివ్వరు

చేసేవన్నీ పనికి మాలిన పనులు

నచ్చ చెప్పినా వినరు

ఎంత తిట్టినా మారరు


మందలో గొర్రెల లాంటి మనుషులు

ఒకడు చెప్పేది విని ఊగిపోవడం తప్ప

తమకు తాముగా ఆలోచించడం చేతకాని సన్నాసులు

తమకి తెలివి లేదని కూడా తెలుసుకోలేని దద్దమ్మలు

తమ నాయకుడి చేతిలో కీలు బొమ్మలు

యజమాని ఉసిగొలిపితే మొరిగే కుక్కలు


ఏరు దాటగానే తెప్ప తగులబెట్టే మూర్ఖులు

కూర్చొన్న కొమ్మనే నరుక్కునే చవటలు

సాయం చేసిన వాడికే నామం పెట్టే ఘనులు

విశ్వాసం లేని అధమాధములు


నలుగురిని చూసి నేర్చుకోమని నానుడి

కానీ ఎవరిని చూసి నేర్చుకోవలో తెలుసుకోవడం కూడా ముఖ్యమే మరి

ఎవరి ప్రవర్తన ఐతే నీకు నచ్చదో

ఇంకొకరితో నువ్వు అలా ప్రవర్తించకుండా ఉంటే సరి